అమ్మాయిలను టచ్ చేస్తున్నారా.? అయితే జాగ్రత్త

అమ్మాయిలను టచ్ చేస్తున్నారా.? అయితే జాగ్రత్త

బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుంపులుగా..లేదా గుమిగూడి ఉన్న చోట, బస్సుల్లో, క్యూ లైన్లో కొందరు ఆకతాయిలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. వారిని తాకడం, చేతులేయడం చేస్తుంటారు.తాము చేసే ఆకతాయి పనులను ఎవరు చూడడం లేదనుకుని క్షణికానందం పొందుతారు.

 అయితే ఇలాంటి ఆకతాయిల ఆట కట్టించేందుకు షీ టీమ్  ఓ కంట కనిపెడుతోంది. అలాంటి ఘటనలను వీడియో తీస్తుంది.  ఎవరైనా సరే వెతికిమరీ పట్టుకుని అరెస్ట్ చేస్తుంది. ఇలాంటి వీడియోలను లేటెస్ట్ గా హైదరాబాద్ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిలను అసభ్యంగా తాకుతున్న పోకిరీలకు  హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. జనాలు గుమిగూడిన ప్రాంతాల్లో అమ్మాయిలను తాకుతున్న యువకుల దృశ్యాలను షీ టీమ్స్  వీడియో తీసి వారిని అరెస్ట్ చేశాయని తెలిపారు . ఈ వీడియోను  ట్విట్టర్లో  పోస్టు చేసి మీరు చేసే  పనులన్నీ చూస్తున్నాం.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.