హైద‌రాబాద్ ను క‌మ్మేసిన కారుమ‌బ్బులు.. ప‌లు చోట్ల వ‌ర్షం

హైద‌రాబాద్ ను క‌మ్మేసిన కారుమ‌బ్బులు.. ప‌లు చోట్ల వ‌ర్షం

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు బాగా ఎండ‌, ఉక్క బోత‌గా ఉండ‌గా.. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ సిటీ మొత్తం కారుమ‌బ్బులు క‌మ్మేశాయి. 

2023, ఆగ‌స్ట్ 12వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుంచి వాతావ‌ర‌ణం చ‌ల్లబ‌డింది. చ‌ల్లటి గాలులు వీచాయి. సిటీలోని చాలా చోట్ల వ‌ర్షం పడుతుంది. కూక‌ట్ ప‌ల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గ‌చ్చిబౌలి, సికింద్రాబాద్ ఏరియాల్లో వ‌ర్షం ప‌డింది.   పంజాగుట్ట, అమీర్ పేట, షేక్ పేట, ఉప్పల్,సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది .

హైదరాబాద్‌లో రానున్న 2 గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు సంగారెడ్డి మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ యాదాద్రి జోగులాంబ నాగర్ కర్నూల్ మెదక్ సిద్దిపేట వనపర్తి జిల్లాలో తేలికటి నుంచి మోస్తారు, భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.