హైదరాబాద్ లో అతి భారీ వర్షాలకు మరోసారి నాగోల్ అయ్యప్ప నగర్ కాలనీ నీట మునిగిపోయింది. భారీ వర్షం పడడంతో డ్రైనేజీ నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. ఇండ్లలోకి నీళ్లు చేరాయి. దీంతో స్థానికులు నీటిని బయటకు తోడేస్తున్నారు. కొందరు ఇండ్లకు తాళాలు వేసి బంధువుల ఇండ్లకు వెళ్లిపోయారు. కాలనీ మొత్తం జలదిగ్భంధమైంది.
జీహెచ్ఎంసీ పై అయ్యప్ప నగర్ కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులకు, డిజాస్టర్ టీమ్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని మండిపడుతున్నారు. అయ్యప్ప నగర్ కాలనీలో వర్షా కాలం వస్తే ఇదే పరిస్థితి అలాగే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు. కనీసం నడవడానికి కూడా వెళ్లే పరిస్థితి లేదని, అధికారులు బయట మాత్రమే చూసి పోతారని మండిపడ్డారు. గతంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇక్కడకు వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చినట్లు.. కానీ.. ఎక్కడ వేసిన గొంగళి అనే చందంగా ఉందన్నారు.
