హైదరాబాద్‌‌‌‌ సెయిలింగ్‌‌‌‌ వీక్‌‌‌‌ షురూ

హైదరాబాద్‌‌‌‌  సెయిలింగ్‌‌‌‌ వీక్‌‌‌‌ షురూ

ప్రతిష్టాత్మక హైదరాబాద్‌‌‌‌ సెయిలింగ్‌‌‌‌ వీక్‌‌‌‌, నేషనల్‌‌‌‌ లేజర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ మంగళవారం ఘనంగా మొదలైంది. హుస్సేన్​సాగర్‌‌‌‌ లేక్‌‌‌‌పై వారం రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌‌‌‌లో  11 క్లబ్‌‌‌‌ల నుంచి మొత్తం 89 మంది రిజిస్టర్‌‌‌‌ చేసుకున్నారు. ఇందులో 11 మంది మహిళలు ఉండగా.. తెలంగాణ నుంచి 17 మంది పోటీ పడుతున్నారు.  

ఈ సీజన్‌‌‌‌లో  పోటీ పడుతున్న  ఓల్డెస్ట్‌‌‌‌ సెయిలర్‌‌‌‌గా 72 ఏండ్ల  మురళీ కానూరి బరిలో నిలిచాడు. తొలి రోజు ప్రాక్టీస్‌‌‌‌ రేసులు నిర్వహించారు. బుధవారం నుంచి మెయిన్‌‌‌‌ రౌండ్‌‌‌‌ జరగనుంది. యాచింగ్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇండియా (ఐవేఐ) గుర్తింపు ఉన్న ఈ టోర్నీ రాబోయే ఆసియా గేమ్స్‌‌‌‌కు ట్రయల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌గా ఉపయోగపడనుంది.