హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. 15 రోజులుగా పెద్దగా చలి లేనప్పటికి మూడు రోజులుగా మెల్లి మెల్లిగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీంతో నగరవాసులు వణికిపోతున్నారు. మంగళవారం పఠాన్ చెరువు ప్రాంతంలో కనిష్టంగా 8 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువ నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అలాగే హయత్ నగర్ లో 11.6, బేగంపేట్ లో 13 డిగ్రీలు, హకీంపేట్ లో 14 .4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు చూస్తే అత్యధికంగా 30.7 డిగ్రీలుగా నమోదయ్యాయి.

