హైదరాబాద్ స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ లైట్ల ఏజెన్సీ రెండు వారాల్లో ఖరారు.. పోటీలో మూడు ప్రధాన ఏజెన్సీలు

హైదరాబాద్  స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ లైట్ల ఏజెన్సీ రెండు వారాల్లో ఖరారు.. పోటీలో మూడు ప్రధాన ఏజెన్సీలు
  •  రెండు రోజుల్లో కమిటీ సమావేశం
  • తర్వాత ప్రభుత్వానికి  ఏజెన్సీల లిస్ట్​ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు : క్యూర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో  స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ లైట్ల నిర్వహణకు సంబంధించి ఏజెన్సీ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 17నెలలుగా పెండింగ్ లో ఉన్న ప్రక్రియ ఎట్టకేలకు పూర్తి కానున్నది.  

స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ లైట్ల నిర్వహణ కోసం టెండర్లు స్వీకరించగా తాజాగా బిడ్లను కూడా ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇందులో భూరత్నం కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌ కంపెనీ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌,  బీఏసీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాటెక్‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌, బజాజ్‌‌‌‌‌‌‌‌ ఎలక్ట్రికల్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. బిడ్ల పరిశీలన తర్వాత అర్హత, టెక్నికల్​అంశాలు, ఆర్థిక ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. దీని కోసం రెండు, మూడు రోజుల్లో స్ట్రీట్‌‌‌‌‌‌‌‌ లైట్ల కోసం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. వీరు అర్హత కలిగిన ఏజెన్సీల జాబితాను ప్రభుత్వానికి పంపితే అక్కడి నుంచి వెలువడే నిర్ణయం ఆధారంగా ఏజెన్సీని ఖరారు చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ రెండు వారాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని 
తెలుస్తోంది. 
పదేండ్ల ఒప్పందం 
స్ర్టీట్ లైట్ల కాంట్రాక్టు విలువ రూ.1,341.60 కోట్లు కాగా, టెండర్​దక్కించుకున్న కంపెనీ పదేండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. 

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీల్లో 7.61 లక్షల స్ట్రీట్‌‌‌‌‌‌‌‌లైట్లుండగా, ఇందులో కనీసం 98 శాతం లైట్లు నిరంతరం వెలిగేలా చూడాలి. ఏ లైట్‌‌‌‌‌‌‌‌పనిచేయకపోయినా 24 గంటల్లోనే గుర్తించి రిపేర్​చేయాలి. అలాగే, వెలిగే లైట్లకే నిర్వహణ చార్జీలు చెల్లిస్తారు.

 ప్రతి ఏడాది దశలవారీగా చేసిన పనులను బట్టి బల్దియా నిధులను చెల్లించనున్నది.  నోడల్‌‌‌‌‌‌‌‌ఏజెన్సీగా జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ చెల్లింపులు నిర్వహించగా, ఎంఎంసీ, సీఎంసీలు  తమ పరిధిలోని స్ట్రీట్‌‌‌‌‌‌‌‌లైట్ల నిర్వహణ వ్యయాన్ని జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీకి చెల్లించే విధంగా ప్రత్యేక విధివిధానాలు రూపొందించారు.