డార్విన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ పట్టు బిగించింది. తన్జిద్ హసన్ (101) సెంచరీకి తోడు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (84) చెలరేగడంతో.. 96/1 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 351/6 స్కోరు చేసింది. మెహిదీ హసన్ మిరాజ్ (32 బ్యాటింగ్), హసన్ మహ్ముద్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్‌కు 102 రన్స్ జోడించి మోమినల్ హక్ (49) ఔటైనా.. తన్జిద్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. నజ్ముల్‌తో కలిసి ఆసీస్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో కెరీర్‌లో తొలి సెంచరీ (188 బాల్స్) నమోదు చేశాడు. అలాగే ఆసీస్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి బంగ్లా బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. చివరకు లైయన్ (1/92) బౌలింగ్‌లో స్టార్క్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫలితంగా మూడో వికెట్‌కు 93 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తర్వాత లిటన్ దాస్ (0) డకౌటైనా.. ముష్ఫికర్ రహీమ్ (36), మెహిదీ హసన్ మెరుగ్గా ఆడటంతో బంగ్లా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 153 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. స్టార్క్, హాజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు.
