కరీంనగర్ టౌన్: రావూస్ స్కూల్‌‌‌‌లో స్టూడెంట్స్ కేబినెట్

కరీంనగర్ టౌన్: రావూస్ స్కూల్‌‌‌‌లో స్టూడెంట్స్ కేబినెట్

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​లోని రావూస్ ఇంటర్నేషనల్ స్కూల్‌‌‌‌లో శుక్రవారం విద్యార్థుల క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించారు. ఈవీఎం ద్వారా విద్యార్థులకు నిర్వహించిన ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్కూల్ ప్రిన్సిపాల్ రెహమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ గర్ల్, హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ బాయ్ పదవులకు ఎన్నికలు నిర్వహించగా.. విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.

ప్రజాస్వామ్య ఎన్నికల విధానాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికలను నిర్వహించినట్లు చెప్పారు. డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం,  ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.