వాషింగ్టన్: చైనా వస్తువులపై విధిస్తున్న సుంకాల నుంచి తప్పించుకునేందుకు భారత్ సహా పలు దేశాలు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది. చైనా ఉత్పత్తులను మూడో దేశాల ద్వారా అమెరికాకు తరలించి, దేశ మూలాన్ని మార్చే ‘షాడో ట్రాన్స్-షిప్‌మెంట్’ నెట్‌వర్క్‌లో భారత్ ఉందని వైట్‌హౌస్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలోవైట్హౌస్అడ్వైజర్పీటర్ నవారో మాట్లాడుతూ ‘ఇండియా మా రాడార్ స్క్రీన్‌పై ఉంది’ అని హెచ్చరించారు.
నవారో రూపొందించిన నివేదిక ప్రకారం చైనా వస్తువులు మూడో దేశాల గుండా రావడంతో అమెరికాకు ఏటా 19 నుంచి 26 బిలియన్ డాలర్ల టారిఫ్ ఆదాయం నష్టం వాటిల్లుతోంది. 2018లో చైనాపై సెక్షన్ 301 టారిఫ్స్ విధించిన తర్వాత ఈ అక్రమ రవాణా పెరిగింది. భారత్, మెక్సికో, కెనడా, ఐరోపా సమాఖ్య, జపాన్ సహా సుమారు 40 దేశాలు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నాయని నివేదిక తెలిపింది.
