టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కించిన చిత్రం 'ది ప్యారడైజ్'. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24 న రిలీజ్ అయిన ఈ మూవీ నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా రికార్డు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ 5 రోజుల్లో రూ. 165 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రూ. 200 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తోంది.
బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఫుల్ జోష్ లో మూవీ టీం ఉంది. ఈ నేపథ్యంలో నానితో పాటు చిత్ర బృందం ములుగు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంది. వనతదేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా హీరో నాని తులాభారంలో బంగారం ( బెల్లం ) సమర్పించగా 74 కిలోల బరువు తూగారు.
ఈ మూవీలో నాని తల్లి పాత్రకు సమ్మక్క పేరు ఉండటం.. ఆపేరుతో ప్రత్యేకంగా రూపొందించిన పాటకు విశేషమైన స్పందన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ సమ్మక్కసారలమ్మలను దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మూవీ టీంకి అమ్మవారి ప్రసాదం అందజేశారు. అంతకుముందు చిత్రబృందానికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. నానిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, స్థానికులు తరలివచ్చారు.
Natural Star @NameisNani & #TheParadise team offered their prayers at the Sri Sammakka Saralamma Devasthanam in Medaram ✨
— THE PARADISE (@TheParadiseOffl) September 29, 2026
Book your tickets now!
🎟️ https://t.co/QWwS4IbJsE pic.twitter.com/BIUYvRsnz5
ఈ సంందర్భంగా 'ది ప్యారడైజ్' మూవీని అదరిస్తున్న ప్రేక్షకులకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. తమ కెరీర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని నాని, సంపూర్ణేష్ బాబు అన్నారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
ALSO READ : థియేటర్లలోకి రాకముందే 'తెల్లకాగితం' లీక్..
Natural Star @NameisNani and #TheParadise team had darshan and performed the rituals at the sacred Sri Sammakka Saralamma Devasthanam in Medaram ✨🙏 pic.twitter.com/2T6vGiLdqo
— THE PARADISE (@TheParadiseOffl) September 29, 2026
