సినీ ఇండస్ట్రీని ఒకవైపు పైరసీ భూతం పట్టిపీడిస్తుంటే.. మరో వైపు లీకేజీల బెడద కలవరపెడుతోంది. కేటుగాళ్ల దెబ్బకు కోట్లాది రూపాయల బడ్జెట్.. వందలాది మంది కష్టం.. ఒక్క క్లిక్ తో బూడిదలో పోసిన పన్నీరైపోతోంది. థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమైన చిత్రం.. నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో నిర్మాతల గుండెలు గుభేలుమంటున్నాయి. లేటెస్ట్ గా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిన యూత్ ఫుల్ మూవీ 'తెల్లకాగితం ' ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో మేకర్స్ లో తీవ్ర ఆందోళన నెలకొంది.
'కోర్ట్' మూవీ ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా, నక్షత్ర హీరోయిన్ గా నటించిన ఈ 'తెల్లకాగితం ' చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. అక్కినేని నాగార్జున సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుండటంతో ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఇటీవల ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులు, బడా నిర్మాతలకు వేసిన స్పెషల్ ప్రివ్యూల నుంచి సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో.. బిజినెస్ పరంగానూ ఈ చిన్న సినిమా భారీ అంచనాలను పెంచేసింది.
అయితే, రిలీజ్ మరో మూడు రోజుల్లో ఉందనగానే సోమవారం అర్థరాత్రి అనూహ్యంగా తగిలింది. సినిమాలోని కొన్ని అత్యంత కీలకమైన సెకండాఫ్ ఎపిసోడ్లు, ఎమోషనల్ క్లైమాక్స్ సీన్లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. మొదట ఇవి కేవలం సాదాసీదా సీన్లే అనుకున్నా... సినిమాలో మెయిన్ ట్విస్టులు ఉన్న వీడియోలే బయటకు రావడంతో అసలు సినిమా మొత్తం లీక్ అయిపోయిందా? అనే అనుమానాలు చిత్రబృందాన్ని కలవరపెడుతున్నాయి.
ALSO READ ; ఈ వారం థియేటర్లోకి కిక్కిచ్చే 7 మూవీస్..
దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్ వైరల్ అవుతున్న లింకులను, HD వీడియో క్లిప్‌లను తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రేక్షకులకు ఒకే ఒక భావోద్వేగ విజ్ఞప్తి చేస్తోంది. కష్టపడి తీసిన కంటెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయకండి... థియేటర్లలోనే ఆ మ్యాజిక్‌ను ఆస్వాదించండి. గతంలో 'అత్తారింటికి దారేది', 'టాక్సీవాలా' వంటి పెద్ద సినిమాలకు లీకేజీ సమస్యలు ఎదురైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. మరి ఈ లీకేజీల షాక్‌ను తట్టుకుని 'తెల్లకాగితం' థియేటర్లలో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
A heartfelt request to our audience. 🙏
— Vamsi Kaka (@vamsikaka) September 29, 2026
Please don’t download, share, or circulate any leaked content from #Thellakaagitham.
Support the team by experiencing the film only in theatres. ❤️ pic.twitter.com/ticOg96e0o
