యూత్‌ఫుల్ లవ్‌స్టోరీలకు మెలోడీ సాంగ్స్ ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటాయి. ఇప్పుడు అదే ఫీల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘ఏమో ఏమో ఇది’ సినిమా. రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రేమకథా చిత్రం అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
ఇప్పటికే గ్లింప్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ నుంచి తాజాగా ఓ అందమైన మెలోడీ సాంగ్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ పాటకు KK అద్భుతమైన సాహిత్యం అందించగా.. కార్తీక్, రమ్య బెహరా తమ మెలోడియస్ వాయిస్‌తో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.
‘‘మొహమా.. వింత మొహమా.. స్నేహమా.. కొత్త స్నేహమా.. తోడుకొబయాయే బంధమా.. నన్ను ఎల్లేటి ప్రాణమా.. అనే పదాలు క్యూట్ ఫీలింగ్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ మాయమిటో తొలి తొలిగా.. ఈ హాయిమీటో తొలి తొలిగా.. ఈ ప్రేమ ఏమిటో తొలి తొలిగా...ఎంతో బాగుంది ఇది..’’ అంటూ సాగే ఈ మెలోడి లిరిక్స్ ఆకర్షిస్తున్నాయి.
ప్రేమలోని అందమైన అనుభూతులను, క్యూట్ ఎమోషన్స్‌ను మెలోడీ టచ్‌తో చెప్పేలా ఈ పాటను కంపోజ్ చేసినట్లు అనిపిస్తోంది. ముఖ్యంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్, కార్తీక్-రమ్య బెహరా వోకల్స్ కలిసి పాటకు ఫ్రెష్ ఫీల్‌ను తీసుకొచ్చాయి. KK లిరిక్స్ కూడా లవ్ ఫీల్‌ను మరింతగా ఎలివేట్ చేస్తున్నాయి. దీంతో ఈ సాంగ్ ప్రస్తుతం యూత్‌ను ఆకట్టుకుంటోంది.
రోషన్ మేక, ప్రీతి ముకుందన్‌ల ఫ్రెష్ పెయిర్ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీరిద్దరి కెమిస్ట్రీకి ఈ మెలోడీ సాంగ్ మరింత బ్యూటిఫుల్ టచ్ ఇచ్చింది. పాటలో కనిపించే విజువల్స్, లవ్ వైబ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
►ALSO READ | థియేటర్లలోకి రాకముందే 'తెల్లకాగితం' లీక్.. మేకర్స్ ఎమోషనల్ విజ్ఞప్తి!
మరోవైపు ‘హిట్’ ఫ్రాంచైజీతో థ్రిల్లర్ జానర్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలను.. ఇప్పుడు పూర్తిగా డిఫరెంట్ జానర్‌లో లవ్‌స్టోరీని తెరకెక్కిస్తుండటంతో ‘ఏమో ఏమో ఇది’పై ఆసక్తి నెలకొంది. శైలేష్ నుంచి వస్తున్న ఈ ఫ్రెష్ లవ్‌స్టోరీలో రోషన్–ప్రీతి జోడీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలకు వస్తున్న స్పందనతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ మెలోడీ మ్యాజిక్, KK లిరిక్స్, కార్తీక్–రమ్య బెహరా వాయిస్, రోషన్–ప్రీతి ఫ్రెష్ కెమిస్ట్రీ కలిసొచ్చిన ఈ కొత్త పాట.. ‘ఏమో ఏమో ఇది’కి యూత్‌లో మరింత బజ్ తీసుకొచ్చేలా కనిపిస్తోంది.
