హిందువుల తొలి పండుగగా పిలిచే ‘తొలి ఏకాదశి’ సందర్భంగా సిటీలోని ప్రధాన ఆలయాలు ఆదివారం రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.