భోపాల్–హైదరాబాద్ ఉగ్ర కోణంలో నిజాలు బయట పడుతున్నాయి. ఏటీఎస్ (యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుల నుండి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్–భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యసిర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. భోపాల్ శివార్లలో యువకులకు హెచ్యూటీ శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు పోలీసులు. ఫిధాయీ దళాల పేరుతో యువకులకు శిక్షణ ఇచ్చారని... హెచ్యూటీ కోడ్ భాషలో ఫిధాయీ అంటే..ఆత్మాహుతి దాడి అని ఏటీఎస్ పోలీసులు కనిపెట్టారు.
ఈ కేసులో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 16 మంది హిజ్బుత్ సభ్యులను లోతుగా విచారిస్తోంది పోలీసుల బృందం. భోపాల్ భోజ్ పురా సమీపంలోని రైసన్ అడవుల్లో యువతకు ఉగ్ర కర్యకలాపాలపై శిక్షణ ఇచ్చారు. అరెస్ట్ అయిన వారి వద్ద పలు వీడియోలు..కోడ్ భాషలో ఉన్న 50కి పైగా ఆడియోలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భోపాల్ లోని శాంతి ద్వీపం పెల్చేయలి అన్న కోడ్ భాషను డీకోడ్ చేశారు. శాంతి ద్వీపం పేల్చడం అంటే..బాంబు పేలుళ్ళు జరపడం అని గుర్తించారు పోలీసులు. భోపాల్ లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యాం వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. ఉగ్ర కార్యకలాపాల కోసం విదేశాల నుండి హవాలా మార్గంలో నిధులు వచ్చినట్టు ఏటీఎస్ పోలీసుల టీమ్ విచారణలో వెల్లడైంది.

