
తెలంగాణలో అతి పెద్ద పండుగ బతుకమ్మ, దసరా కావడంతో హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతోంది. లక్షలాది మంది ప్రజలు సొంతూర్లకు వెళుతుండటంతో బస్లాండ్లు, రైల్వే్స్టేషన్లు, ఎక్కడ చూసినా జనమే కనిపిస్తున్నారు. దీంతో నగర శివారులు, చెక్ పోస్టులు, టోల్ ఫ్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అర్థరాత్రి నుంచే పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
బీబీనగర్ మండలం గూడురు టోల్ ప్లాజా దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దసర పండుగ సందర్భంగా ఊళ్లకు వెళుతుండడంతో టోల్ ప్లాజా దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
జనమంతా ఊర్లకు వెళుతుండటంతో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. రోడ్లపై రద్దీ తగ్గీపోయింది. ట్రాఫిక్ తగ్గిపోయింది. ఇక ఊర్లకు వెళుతున్న వారికి పోలీసులు హెచ్చరిక జారీ చేశారు పోలీసులు. ఇళ్లకు తాళం వేసేముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సూచించారు. దొంగలు పడే అవకాశమున్నందున జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
►ALSO READ | దసరాకు పల్లెబాట పట్టిన జనం.. కిక్కిరిసిన MGBS, JBS
మరో వైపు ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాంట్లు ప్రయాణికులతో నిండిపోయాయి. గత రెండు రోజులుగా మూసీ ఉదృతితో MGBS బస్టాండు మూసివేసిన విషయం తెలిసిందే. మూసీ వరదలు తగ్గడంతో ఆదివారం ఉదయంలోపే బురద మొత్తాన్ని శుభ్రం చేశారు. దీంతో బస్టాండ్ ప్రయాణికులతో మళ్లీ ఎంజీబీఎస్ కళకళలాడుతోంది.