Toll Plaza Charges : హైదరాబాద్ టు విజయవాడ.. భారీగా పెరిగిన టోల్ ఛార్జీ 

Toll Plaza Charges : హైదరాబాద్ టు విజయవాడ.. భారీగా పెరిగిన టోల్ ఛార్జీ 

కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు 5శాతానికి పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ  నుంచి అమలవుతాయని ప్రకటించింది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలవుతాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్ ధరలను రూ.10  రూ.60  వరకు పెంచారు.

ఈ క్రమంలో ఎన్ హెచ్ 65 మీదుగా హైదరాబాద్ టు విజయవాడ వెళ్లిరావడానికి వాహనదారులు భారీ మొత్తంలో టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ హైవేపై రూ. 465 చెల్లిస్తున్నారు. అయితే, ఇకనుంచి (ఏప్రిల్ 1) రూ.490 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ లెక్కన రూ.25 టోల్ ఛార్జ్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూట్ లో పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు టోల్‌ప్లాజాలు ఉన్నాయి.  

ప్రస్తుతం ఈ హైవేపై ఒకవైపు ప్రయాణానికి రూ.310 చెల్లిస్తుండగా, ఇకపై 325 చెల్లించాలి. మినీబస్సులు, లైట్‌ మోటార్‌ వాణిజ్య, సరకు రవాణా వాహనాలు, భారీ, అతి భారీ వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తానికి అదనంగా 5 శాతం  కట్టాల్సి వస్తుంది.