హైదరాబాద్ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ వరకు చేపట్టిన స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులతో శ్రీనగర్ ‘టీ’ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ భవన్ రూట్లో ట్రాఫిక్ జామ్ఏర్పడుతుండడంతో ట్రాఫిక్పోలీసుల కొన్ని సూచనలు చేశారు. శ్రీనగర్ కాలనీ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్లేవారు ఎన్‌ఎఫ్‌సీఎల్ వద్ద యూటర్న్ తీసుకోవాలని,.. ఎన్టీఆర్ భవన్, కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లేవారు ఇందిరానగర్ గడ్డ, వెంకటగిరి మీదుగా వెళ్లాలని కోరారు.
అలాగే, బేగంపేట నుంచి మాదాపూర్ వెళ్లాలనుకునేవారు పంజాగుట్ట, తాజ్ కృష్ణ, రోడ్ నంబర్ 1 మీదుగా వెళ్లాలని, సాగర్ సొసైటీ నుంచి మాదాపూర్ వెళ్లాలనుకుంటే శ్రీనగర్ కాలనీ, ఇందిరానగర్ గడ్డ, వెంకటగిరి మార్గాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలని కోరారు. రద్దీ వేళల్లో నావిగేషన్ యాప్స్ వాడాలని..వీలైనంత వరకు పబ్లిక్ట్రాన్స్పోర్ట్లేదా కార్ పూలింగ్ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
