విజయవాడలో తెలంగాణ పోలీసుల రైడ్.. 730 కేజీల గంజాయి పట్టివేత

విజయవాడలో తెలంగాణ పోలీసుల రైడ్.. 730 కేజీల గంజాయి పట్టివేత

డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) హైదరాబాద్‌ విభాగం నవంబర్ 8న విజయవాడలో చేపట్టిన ఆపరేషన్‌లో 731 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డీఆర్‌ఐ బృందం నిఘా వేసి విజయవాడ శివార్లలో పక్కా ప్రణాళికతో లారీని అడ్డగించింది. ట్రక్కు ట్రైలర్ బెడ్ బేస్‌లో అధికారులు ఓ రహస్య కుహరాన్ని కనుగొన్నారు. గుర్తించకుండా తప్పించుకోవడానికి ఈ రహస్య కుహరంలో గంజాయి ప్యాకెట్లను దాచి ఉంచారు. దాదాపు రూ.2.19 కోట్ల విలువైన 731 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని సేకరించి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్రమాస్తులు, రవాణా చేసేందుకు ఉపయోగించిన వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని నిబంధనల ప్రకారం ట్రక్కు డ్రైవర్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు.