- హుస్సేన్ సాగర్ లో 66 వేలు..
- జీహెచ్ఎంసీలో 1,20,000..
- సీఎంసీలో 1,19,667..
- ఎంఎంసీలో 70,710 విగ్రహాల ఇమ్మర్షన్
- నేడు కూడా కొనసాగనున్న కార్యక్రమం
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో వినాయక నిమజ్జనోత్సవం శనివారం రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి హుస్సేన్‌సాగర్‌లో మొత్తం 66 వేల వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లోనే సుమారు 26 వేల ప్రతిమలు సాగర్‌కు తరలివచ్చాయన్నారు. ఇక, మూడు కార్పొరేషన్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో 1,20,000, సీఎంసీ పరిధిలో 1,19,667, ఎంఎంసీ పరిధిలో 70,710 విగ్రహాలు.. మొత్తం 3 లక్షలకు పైగా విగ్రహాల ఇమ్మర్షన్పూర్తయిందని పేర్కొన్నారు.
భారీ సంఖ్యలో విగ్రహాలు వచ్చినప్పటికీ ముందస్తు ఏర్పాట్లతో కార్యక్రమం ప్రశాంతంగా సాగిందని చెప్పారు. హుస్సేన్ సాగర్‌తోపాటు నగరంలోని ఇతర నిమజ్జన కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు పారిశుధ్య సిబ్బంది నిమజ్జన కేంద్రాల్లో నిరంతరం పారిశుధ్య పనులు చేపట్టారు. అయితే, నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంకా కొన్ని విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉండటంతో ఆదివారం కూడా కార్యక్రమం కొనసాగనుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
