ట్యాంక్ బండ్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 300 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు స్పష్టం చేశారు. శనివారం లిబర్టీలోని ఆప్రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల పోస్టర్ఆవిష్కరించారు. ఈ ఎన్నికల్లో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తామని, ఆసక్తి ఉన్నవారు రాజకీయాల్లోకి రావాలన్నారు.
నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక హక్కులు అందుబాటులో ఉండేలా పనిచేయడమే తమ పార్టీ ఎజెండా అని పేర్కొన్నారు. నాయకులు జావిద్ షరీఫ్, ఆంజనేయులు, బాబూలాల్, పవర్, తేజ పాల్గొన్నారు.
