నాగార్జునసాగర్, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ సిటీకి అత్యవసరంగా వాటర్ పంపింగ్

నాగార్జునసాగర్, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ సిటీకి అత్యవసరంగా వాటర్ పంపింగ్

హైదరాబాద్ సిటీకి నీరు అందిస్తున్న  జలాశయాల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని జలమండలి తెలిపింది. రాబోయే నాలుగు నెలలకు త్రాగునీరుకు ఎలాంటి ఇబ్బంది లేదని  స్పష్టం చేసింది. 2024 ఏప్రిల్ 15 నుంచి నాగార్జున్‌సాగర్‌, మే1 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి అత్యవసర పంపింగ్‌ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.  ప్రస్తుతం 644 ట్యాంకర్లు నగరంలో నీటిని సరఫరా చేస్తున్నాయని..  ఏప్రిల్ 03 బుధవారం ఒక్కరోజే 6,593 ట్రిప్పులు అందించినట్లుగా వెల్లడించారు.  

మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో ట్యాంకర్లకు ఎక్కువ డిమాండ్‌ ఉన్నట్లు అధికారులు వివరించారు. మిషన్‌ భగీరథ సకాలంలో పూర్తి చేయకపోవడంతో జలమండలే నీటిని సరఫరా చేస్తోంది. గజ్వేల్‌, ఆలేర్‌, భువనగిరి ప్రాంతాలకు నిత్యం 149.47 మి.లీ.లు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది.  

ప్రస్తుతం నాగార్జున సాగర్ లో 136.47 టీఎంసీల నీరు ఉంది. డెడ్‌స్టోరేజీ లభ్యత 131.66 టీఎంసీల కాగా  డెడ్‌స్టోరేజీ ఉన్నా 4.81 టీఎంసీలు నీరు వాడుకోవచ్చు. ఇక  ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయానికి వస్తే అక్కడ 7.71 టీఎంసీల  వాటర్ం  ఉంది. డెడ్‌ స్టోరేజీ లభ్యత 3.31 టీఎంసీలుగా  ఉంది.