హైదరాబాద్: మంచి వాతావరణం, రవాణా సౌకర్యం, విశాలమైన స్పేస్, నిరంతరాయమై కనెక్టివిటీ.. ఇలా అన్ని సౌకర్యాలున్న ఆఫీస్ స్పేస్ కోసం వెతుకుతున్నారా.. అయితే ఎల్ అండ్ టీ సంస్థ బంపర్ ఆఫర్ ఇస్తోంది. నగరంలో మూడు ప్రధాన మెట్రో స్టేషన్లలో సురక్షితమైన రిమోట్ కోవర్కింగ్ స్పెసెస్ కోసం ఆఫీస్ బబుల్స్ ను ప్రారంభించింది. ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ లకోసం పెరుగుతున్న డిమాండ్ ను గుర్తించిన ఆఫీస్ బబుల్స్ ను ఓపెన్ చేసినట్లు ఎల్ అండ్ టీ చెబుతోంది. ఇది పట్టణ రవాణా రంగంలో మొట్ట మొదటి వినూత్న ప్రయోగం.
ఈ ఆఫీస్ బబుల్స్ ద్వారా ఎల్ అండ్ టీ సంస్థ హైదరాబాద్ లోని మెట్రో స్టేషనల్లో మీకు కావాల్సిన స్పేస్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ స్థలంలో ఎటువంటి ఆఫీసులైన పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ ఆఫీసుల వంటి కమర్షియల్ ఆఫీసులను ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రస్తుతం HITECH సిటీ, దుర్గం చెరువు, మాదాపూర్ వంటి మెట్రో ప్రధాన స్టేషన్లలో ఈ ఆఫీస్ బబుల్స్ ను ఏర్పాటు చేశారు. 10వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు ఇస్తోంది ఎల్ అండ్ టీ సంస్థ. ఎల్ అండ్ టీ సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త విధానం రిమోట్ ఆఫీసులను ఏర్పాటు చేసుకునేందుకు మంచి అవకా శాన్ని అందిస్తుంది. నిరంతరాయమైన కనెక్టివిటీకోసం హైదరాబాద్ మెట్రోనెట్ వర్క్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ను ఉపయోగించుకున్న మొదటి కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ ‘ట్రెండ్జ్ వర్క్ స్పేస్ ’ అని సంస్థ ప్రకటించింది.
బిజినెస్ పరంగా అనుకూలమైన మోడర్న్ ఎఫిషియెంట్ వర్క్ ఎన్విరాన్ మెంట్ ను కోరుకునే సంస్థలకోసం నిరంతరాయమైన కనెక్టివిటీని ఈ ఆఫీస్ బబుల్స్ ఆఫర్ చేస్తోందని ఎల్ అండ్ టీ సంస్థ తెలిపింది.
స్పేష్ ఆప్షన్లు
‘‘ఆఫీస్ బబుల్స్’’ క్లెయింట్స్ కోరుకున్న విధంగా అనేక రకాల సైజులలో లభిస్తోంది. రెండు యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా 1750 చదరపు అడుగుల స్థలాన్ని పొందవచ్చు. ఇది హైదరాబాద్ లోని మొత్తం 49 టిపికల్ మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంది. అంతేకాదు.. పెద్ద స్థలాలు కూడా లీజుకు తీసుకోవచ్చు. 8 నాన్ టిపి కల్ మెట్రో స్టేషన్లలో 5వేల చదరపు అడుగుల నుంచి 30 వేల చదరపు అడుగుల వరకు లీజుకు తీసుకోవచ్చు. ఎక్కువ రద్దీ ఉంటే మెట్రో స్టేషన్లో ఈ ఆఫీస్ బబుల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.