శ్రీవారి ఆలయ పునర్నిర్మాణ పనులు షురూ

శ్రీవారి ఆలయ పునర్నిర్మాణ పనులు షురూ
  • వైభవంగా బాలాలయ ప్రతిష్ఠోత్సవం

కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలయ నిర్మాణ పనులకు రూ.110 కోట్లు మంజూరు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో శ్రీవారి మూలవిరాట్ దర్శనం సుమారు రెండేళ్లపాటు నిలిపివేస్తున్నట్లు ధర్మకర్తలు వెల్లడించారు. ప్రత్యామ్నాయంగా బాలాలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

బాలాలయ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకుల బృందం శాస్త్రోక్తంగా నిర్వహించింది. కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, ఈఓ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.