మెహిదీపట్నం, వెలుగు : ఐదు కిలోమీటర్ల రన్నింగ్ చేస్తున్న ఓ జవాన్ కిందపడి చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ఆర్మీ ఏరియాలో గురువారం జరిగింది. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం... జమ్మూకశ్మీర్‌కు చెందిన వినయ్‌కుమార్ (25) ఆర్మీలో జవాన్‌గా పనిచేస్తూ మెహిదీపట్నం సమీపంలోని జమ్మూకశ్మీర్ 12వ బెటాలియన్‌లో ఉంటున్నాడు. రోజు మాదిరిగానే గురువారం ఉదయం ఐదు కిలోమీటర్ల రన్నింగ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఒక్కసారిగా కిందపడిపోవడంతో గమనించిన మిగతా జవాన్లు వెంటనే లంగర్‌హౌస్‌లోని మిలిటరీ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు వినయ్‌కుమార్ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆర్మీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
