పెన్షనర్ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్‌గా వెంకట్ రెడ్డి

పెన్షనర్ల సంఘం స్టేట్ ప్రెసిడెంట్‌గా వెంకట్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పీఆర్టీయూ మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంసీ లింగన్న, ఫైనాన్స్ సెక్రెటరీగా ప్రహ్లాద్ రావు, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా సీతారామయ్య, వైస్ ప్రెసిడెంట్లుగా శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, జగదీశ్ చంద్ర, యుగంధర్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, స్టేట్ సెక్రెటరీలుగా వెంకటేశ్వర్లు, మనోహర్ కుమార్, లక్ష్మీ నర్సింహారావు, శ్యామ్ రావు, విజయలక్ష్మీ ఎన్నికయ్యారు. 

గురువారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 23మందితో కొత్త కమిటీని ఎన్నుకున్నారు.అనంతరం రాష్ట్ర నూతన అధ్యక్షుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... 33 జిల్లాల్లో, 262 యూనిట్లలో విస్తరించి ఉన్న ఈ సంఘంలో దాదాపు 2.46 లక్షల మంది సభ్యులున్నారని చెప్పారు.