బీసీ అట్రాసిటీ చట్టం తేవాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

బీసీ అట్రాసిటీ చట్టం తేవాలి : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

బషీర్‌‌బాగ్, వెలుగు: తెలంగాణలో బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేకంగా బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో బషీర్‌‌బాగ్ సమీపంలోని ఓ ప్రైవేట్ హోటల్‌‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల కంటే ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నది బీసీలేనని పేర్కొన్నారు. కుమ్మెర ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.