పేపర్ లెస్ వాటర్ బోర్డు !.. ఈ–ఆఫీస్ ప్రారంభించిన  ఎండీ అశోక్ రెడ్డి

పేపర్ లెస్ వాటర్ బోర్డు !.. ఈ–ఆఫీస్ ప్రారంభించిన  ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో వినియోగదారులకు పేపర్​లెస్​సేవలు అందించాలని వాటర్​బోర్డు నిర్ణయించింది. నగరంలోని అన్ని ఆఫీసుల్లో ‘ఈ-–ఆఫీస్’ వ్యవస్థను పూర్తిగా అమలు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం బోర్డు హెడ్డాఫీసులో జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి ఆయన ఈ-–ఆఫీస్ ప్రారంభించారు. ఎండీ మాట్లాడుతూ ఈ-ఆఫీస్ విధానం ద్వారా ఫైళ్ల పరిష్కారం తొందరగా అవుతుందన్నారు. ఇక నుంచి ఏ ఫైల్​కూడా  మాన్యువల్ గా స్వీకరించడం జరగదన్నారు.

ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఈ–-ఆఫీసులో స్కాన్ చేసి భద్రపరచడమే కాకుండా వివిధ విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ– ఆఫీసులో పొందుపరచడం జరుగుతుందన్నారు. మొదట హెడ్డాఫీసులో అన్ని కార్యకలాపాలను ఈ–-ఆఫీస్ లో నిర్వహిస్తామని, విడతల వారీగా అన్ని డివిజన్లలో ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు. పర్సనల్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, రెవెన్యూ సీజీఎం కిరణ్ కుమార్ పాల్గొన్నారు.