V6 News

వాటర్ బోర్డుకు మూడు పీఆర్ఎస్ఐ అవార్డులు

వాటర్ బోర్డుకు  మూడు పీఆర్ఎస్ఐ  అవార్డులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలంగాణ రైజింగ్-–2047 భాగంగా ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్లిక్ రిలేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్​ఎస్​ఐ) తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్- లో వాటర్​బోర్డుకు మూడు అవార్డులు వచ్చాయి. ఓఆర్ఆర్ పరిధిలో భూగర్భ జలాలు పెంచేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు మొదటి బహుమతి లభించింది. సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ-గా చేయడానికి, ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా రూపొందించిన డాక్యుమెంటరీకి కార్పొరేట్ వీడియో ప్రొడక్షన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఫీచర్ విభాగంలో సెకండ్​ ప్రైజ్ ​దక్కింది. 

ఇంకుడు గుంతల నిర్మాణంపై టెక్నికల్​ఇన్ఫర్మేషన్​తో రూపొందించిన పోస్టర్ కు బెస్ట్ లేఅవుట్ అండ్​ డిజైన్ కేటగిరీలో సెకండ్​ ప్రైజ్​వచ్చింది. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఆదివారం జరిగిన పీఆర్ఎస్ఐ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ లో రిటైర్డ్​ ఐఏఎస్ కేవీ రమణాచారి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రియాంక, ప్రొఫెసర్​ నాగేశ్వరావు ఈ అవార్డులు అందజేశారు.