ధగధగలు : హైదరాబాద్ లో బంగారం షాపింగ్ ఫెస్టివల్

ధగధగలు : హైదరాబాద్ లో బంగారం షాపింగ్ ఫెస్టివల్

ఆల్​ ఇండియా జెమ్​ అండ్​ జ్యువెలరీ డొమెస్టిక్​ కౌన్సిల్​(జీజేసీ) అక్టోబర్​12 నుంచి 17 వరకు నిర్వహించనున్న ఇండియా జ్యువెలరీ షాపింగ్​ ఫెస్టివల్​కు హైదరాబాద్​ వేదిక కానుంది. ఐడీటీ జెమ్మోలాజికల్​ లేబొరేటరీస్​ వరల్డ్​వైడ్​ టైటిల్​ స్పాన్సర్​, డివైన్​ సోలిటరీస్​మరో స్పాన్సర్​​గా వ్యవహరిస్తున్నారు. జాయింట్​ కన్వీనర్​ మనోజ్​ జా మాట్లాడుతూ... అక్టోబర్​లో ఈ ఈవెంట్​ను నిర్వహించనున్న తేదీల వివరాలు వెల్లడించారు. ఐజేఎస్​ఎఫ్​ భారత్​ని ఆభరణాల షాపింగ్​కు గమ్యస్థానంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

ఐదు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ది బెస్ట్​ జ్యువెలర్స్​ని ప్రదర్శించడం, వేలం వేయడం, అమ్మకాలను పెంచి బంగారం ఇండస్ర్టీకి మద్దతు ఇవ్వడం తద్వారా ఇండియా వారసత్వం, సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నామన్నారు.  వినియోగదారులను భాగస్వామ్యం చేయడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రూ.25 వేల గోల్డ్​ కొనుగోలుపై ఒక కూపన్​ ఇవ్వనున్నట్లు వివరించారు. డిజిటల్​ ఇండియాను ప్రోత్సహించేందుకు మొత్తం ప్రోగ్రాం డిజిటల్ లో పూర్తి పారదర్శకంగా జరుగుతుందని చెప్పారు.