
మూసీ పరివాహక ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. చాదర్ ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో పర్యటించారు. చాదర్ ఘాట్ ప్రాంతంలో మూసి నది ముంచెత్తిన నివాస ప్రాంతాలలో సహాయక చర్యలను పరిశించారు కమిషనర్. నీట మునిగిన ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేశారు కమిషనర్. ఎంజీబీఎస్ దగ్గర మూసి నది రిటైనింగ్ వాల్ పడిపోవడంతో వరద లోపలకి ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.
సెప్టెంబర్ 226న శుక్రవారం అర్ధ రాత్రి ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద వచ్చినప్పుడు చేపట్టిన సహాయక చర్యలను అభినందించారు కమిషనర్ రంగనాథ్. మూసీ వరదల దృష్ట్యా పరీవాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు పడకుంటే సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెప్పారు. హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను కొనసాగాస్తున్నాయి.
హైదరాబాద్ జంట జలాశయాలకు (ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్) భారీగా వరద నీరు చేరడంతో గేట్లను ఎత్తి జలమండలి అధికారులు నీటిని కిందకు వదిలారు. గండిపేట్ మొత్తం 15 గేట్ల 9 ఫీట్ల ఎత్తు వదిలి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. నార్సింగ్ దగ్గర సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీరు పొంగుపొర్లుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్ గేట్ 18 దగ్గర ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. ఈ రోడ్డు మార్గంలో వాహనాలను, చుట్టు పక్కల ప్రజలు రాకుండా పోలీసులు, హైడ్రా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.