నాలా ఆక్రమించి నిర్మించినట్లు తేలితే..ఆ బిల్డింగ్ ను కూల్చేస్తాం: రంగనాథ్

నాలా ఆక్రమించి నిర్మించినట్లు తేలితే..ఆ బిల్డింగ్ ను కూల్చేస్తాం: రంగనాథ్

హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రివనం సమీపంలో జరిగిన భారీ అగ్నిప్రమాద స్థలాన్ని హైడ్రా’ కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. కేఎస్ఆర్ భవనానికి అసలు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఈ భవనాన్ని నాలాను ఆక్రమించి నిర్మించినట్లు తేలితే... ఖచ్చితంగా కూల్చివేస్తామని కమిషనర్ రంగనాథ్ తీవ్రంగా హెచ్చరించారు. 

ఈ సందర్భంగా మ ాట్లాడిన ఆయన..  కేఎస్ఆర్ భవనంతో పాటు దాని పక్కనే ఉన్న ‘హర్ష డీలక్స్ మెస్’ను కూడా హైడ్రా కమిషనర్ పరిశీలించారు. అయితే ఈ ప్రమాదం మెస్సులో ఏదైనా స్పార్క్ వల్ల జరిగిందా... లేక షార్ట్ సర్క్యూట్ కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

ప్రాథమిక పరిశీలనలో ఈ బిల్డింగ్ కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించలేదని స్పష్టమైంది. అత్యవసర సమయాల్లో బయటపడటానికి ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు ఒక్కటే ఉన్నాయని... భవనం చుట్టూ ఉండాల్సిన సెట్ బ్యాక్ కూడా వదల్లేదని అధికారులు గుర్తించారు.  బిల్డింగ్ ఓనర్ గతంలోనే ఈ నిర్మాణాలను పూర్తి చేసి, ఇతరులకు అమ్మేసి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. విచారణ తర్వాత అన్ని విషయాలు పూర్తిస్థాయిలో వెలుగులోకి వస్తాయన్నారు. నిబంధనలను ఎవరు అతిక్రమించినా సరే... చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు.