
హైడ్రా అంటే పేదల ఇళ్లను కూలగొట్టడానికి ఏర్పాటు చేశారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ హైడ్రా అంటే కూలగొట్టడానికే కాదు.. హైదరాబాద్ నగరాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేసిన సంస్థ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొందరు కడుపు మంటతో హైడ్రా గురించి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మూసీని ఆక్రమించిన వారికీ, నాళాలు, చెరువులను కబ్జాలు చేసిన వారికే హైడ్రా అంటే భయం అని అన్నారు. గురువారం హైదరాబాద్ లోని బుద్ధభవన్ దగ్గర నిర్మించిన హైడ్రా పోలీస్ స్టేషన్ తో పాటు హైడ్రా వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చేసిన కీలక వ్యాఖ్యలు:
- హైడ్రాలో డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉన్నాయి
- 12 మంది ఎస్సైలు, 30 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు
- హైడ్రా వర్షాలు వస్తే ప్రజలను కాపాడుతారు..
- విపత్తులు వస్తే అండగా ఉంటారు
- హైడ్రా టీమ్.. చెట్లు కూలితే తొలగిస్తున్నారు.. కరెంటు పునరుద్ధరిస్తున్నారు
- వరదల్లో ప్రజలను ఎలా కాపాడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు
- కోటి 20 లక్షల మంది నగర వాసులు ఉన్నారు.
- 940 చెరువులకు 420 కబ్జాలకు గురయ్యాయి.. నాలాలు మూసుకుపోయాయి
- ట్రాఫిక్ జాం కు కారణం.. ఆక్రమణ కాదా.. నాలాలు ఆక్రమించినందుకే కదా ట్రాఫిక్ జామ్
- గండిపేట్, ఉస్మాన్ సాగర్ లలో డైరెక్ట్ గా నిర్మాలు చేపడుతున్నారు.
- ఫామ్ హౌజ్ ల మురికి నీటిని జలాశయాలలోకి పంపిస్తున్ననారు
- పరిస్థితి ఇలాగే ఉంటే హైదరాబాద్ ప్రజలకు తాగు నీరు ఎలా అందించాలి
- చెరువుల కబ్జా చేసి నిర్మాణాలు కట్టడం వలన నీళ్లు ఇండ్లల్లోకి వస్తున్నాయి
- అందుకే పేదలను కాపాడేందుకే.. హైట్రా ఏర్పాటు చేశాం
- బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటలోనే నిర్వహించాలని నిర్ణయించాం
కజ్బాలు చేసినవారికి, ప్రోత్సహించిన వారికే హైడ్రా అంటే భయం:
- గొప్ప వ్యక్తులు గా చెప్పుకునేవారు చెరువులను కబ్జా చేశారు
- అలాంటి వారిపై చర్యలు తీసుకుని చెరువులను కాపాడటం తప్పా
- ఎవరైతే మూసీ ఆక్రమణలను ప్రోత్సహించారో, నాలాలను ఆక్రమించారో, అక్రమ నిర్మాణాలను చేపట్టారో వారికే.. హైడ్రా అంటే భయం..
- ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా.?
- కొందరు కడుపు మంటతో మమ్మల్ని వ్యతిరేకించినా, దూషించినా పట్టించుకోం
- హైదరాబాద్ నగరాన్ని కాపాడి తీరుతాం
- మూసీని కబ్జా చేసిన పెద్ద వాళ్లను తొలగించి పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తున్నాం.
- హైడ్రా అధికారులు పెద్దలపై కఠినంగా, పేదలపై జాలీగా వ్యవహరించాలి
- పేదల ఆస్తులను, గౌరవాన్ని కాపడటంలో హైడ్రా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ.. కాపాడుకోవాలి:
- 1908లో ఆనాడు వచ్చిన వర్షాలు నిజాం సర్కార్ ను కదిలించింది..
- వరదల నుంచి మానవాలిని కాపాడేందుకు ఒక గొప్ప ఆలోచనతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన కట్టడాలే మూసీ నదీ, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్..
- మూసీ, ఈసా నదులను ఒడిసిపట్టి నీటిని నిల్వ ఉంచేందుకు ఈ జలాశయాలను నిర్మించారు.
- శతాబ్దం కింద కట్టిన జంట జలాశయాలు ఇప్పటికీ మనకు నీరు అందిస్తున్నాయి.
- ఇంత పెద్ద జలాశయాలను కబ్జా చేశారు.
- అక్కడ ఫామ్ హౌజ్ లు ఏర్పాటు చేసుకుని మురుగునీరును వదులుతున్నారు
- ఆ నీటిని మనం తాగాలా..? వారిపై చర్యలు తీసుకోకూడదా..?
- చెరువులు మనకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తి.. కనుమరుగైతే మనుగడ కష్టం
- కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది
- ఫ్యూచర్ సిటీలు, హైటెక్ సిటీలు కట్టుకుని ఓల్డ్ సిటీని మరిచిపోతున్నాం
- ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ.. కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాం
మెట్రో పాలిటన్ సిటీలు నివాస యోగ్యంగా లేవు:
- బెంగళూర్ లో బోర్లు పడే పరిస్థితి లేదు.. పెద్ద పెద్ద సంస్థలు వలసలు వెళ్తున్నారు
- తాగడానికి విలవిలలాడి ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడింది
- ముంబై, చెన్నైలలో వరదలు వస్తే నగరాలు మునిగిపోయే పరిస్థితి
- ఢిల్లీ కాలుష్యంతో ప్రభుత్వ సంస్థలకే సెలవులు ఇచ్చే పరిస్థితి
- ఇదంతా మానవ తప్పిదం..
- మెట్రో పాలిటన్ సిటీలు నివాస యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి
- ఈ ఉపద్రవం నుంచి గుణపాఠం నేర్చుకోకుంటే హైదరాబాద్ కూడా వాటి సరసన చేరే పరిస్థితి ఉంది
- అందుకే ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఎంత దుష్ప్రచారం చేసినా కాపాడాలని నిర్ణయించుకున్నాం.