హైడ్రాకు ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు..ఎన్హెచ్ 65లో వరద నిల్వకుండా చూడాలని వినతి

హైడ్రాకు ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు..ఎన్హెచ్ 65లో వరద నిల్వకుండా చూడాలని వినతి

 హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీస్​లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ట్రాఫిక్​పోలీసులు కమిషనర్​రంగనాథ్​ను కలిసి ఓ సమస్య పరిష్కరించాలని కోరారు. ప్రజావాణిలో మొత్తం  42 ఫిర్యాదులు రాగా, క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్, అడిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ డైరెక్టర్ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ల పాప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్య స్వీకరించారు.  

బీహెచ్ఈఎల్, రామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చంద్రాపురం ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల్లోని నేష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ హైవే 65లో ఎక్కడిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్కడ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షపు నీరు నిలిచిపోతోంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్యను ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిష్కరించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని మియాపూర్ ట్రాఫిక్ డివిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ పోలీసులు ఫిర్యాదు చేశారు. 13 ప్రాంతాల్లో వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద నిలిచిపోతోంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షాకాలం తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెత్తుతున్నాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని పేర్కొన్నారు.