కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు

కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: నగర శివారు పెద్ద అంబర్​పేట్ కుంట్లూరు పరిధిలోని అంజనాద్రి నగర్​లో రోడ్లు, ప్లాట్లను కబ్జా చేశారన్న ఫిర్యాదుపై హైడ్రా అధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. సర్వే నంబర్ 204, 208లోని రోడ్లను ‘గురు కృష్ణ డెవలప్​మెంట్’ వారు ఆక్రమించారని ప్లాట్ల ఓనర్ అసోసియేషన్ సభ్యులు ఇటీవల కమిషనర్ రంగనాథ్​కు ఫిర్యాదు చేశారు.

దీనిపై అధికారులు విచారణ జరిపి ఆక్రమణలు జరిగినట్లు ధ్రువీకరించారు. కమిషనర్ ఆదేశాల మేరకు సీఐ సైదులు నేతృత్వంలోని బృందం శుక్రవారం ఆక్రమణలను తొలగించి రోడ్డును పునరుద్ధరించారు. సకాలంలో స్పందించి తమ సమస్యను పరిష్కరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్​కు ప్లాట్ల యజమానులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.