ఆక్రమణలపై హైడ్రా మరోసారి పంజా విసిరింది. హైదరాబాద్ కూకట్‌పల్లి గోపాల్ నగర్ లో కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. జనవరి 23న 3300 గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది . స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా పార్కు స్థలాన్ని కాపాడింది.
సర్వే నంబర్లు 148 నుంచి 155 వరకు మొత్తం 92.21 ఎకరాల లే ఔట్ ఉంది. 1980లో ఏర్పాటైన ఈ లే ఔట్‌లో 1200కు పైగా ప్లాట్లు ఉండగా.. లే ఔట్ లో అప్పట్లో 3 చోట్ల పార్కుల కోసం స్థల కేటాయించారు. ఇప్పటికే రెండు పార్కులు ఆక్రమణకు గురయ్యాయని.. మూడో పార్కు కూడా కబ్జా అవుతుందంటూ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో క్షేత్రస్థాయి విచారణ జరిపిన జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు పార్కు స్థలంలో కబ్జాకు గురైనట్టు నిర్ధారించారు. పార్కులో అక్రమంగా వేసిన షెడ్డును తొలగించారు అధికారులు. పార్కు స్థలమని సూచిస్తూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
జనవరి 19న
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ మండలంలో కాచవాణి సింగారం గ్రామంలోని దివ్యానగర్ లే ఔట్‌లో 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడారు హైడ్రా అధికారులు. నల్లమల్లారెడ్డి భూ అక్రమాలపై చర్యలు తీసుకున్నారు.
జనవరి 21న
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో రూ.300 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు కాపాడారు. బాచుపల్లి సర్వే నంబర్లు 142, 143, 144లోని 2.30 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ పార్కు కోసం కేటాయించగా కొందరు ఆక్రమించారు. ప్రజావాణిలో ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో ఆక్రమించిర ఆక్రమణలను తొలగించి స్థలం కాపాడారు.
