జిల్లాల్లోనూ ఆపదమిత్రులు,,115 మందికి ట్రైనింగ్ ఇచ్చిన హైడ్రా

జిల్లాల్లోనూ ఆపదమిత్రులు,,115 మందికి ట్రైనింగ్ ఇచ్చిన హైడ్రా

హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌ సిటీ, వెలుగు: ప్రకృతి వైపరీత్యాల టైంలో అందుబాటులో ఉండి సేవలందించాలని యువ ఆపద మిత్ర వాలంటీర్లకు హైడ్రా ఆఫీసర్లు సూచించారు.  హైడ్రా ఆఫీసులో గురువారం సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలకు చెందిన 115 మంది యువ ఆపదమిత్ర వాలంటీర్ల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమం నిర్వహించారు.  హైడ్రా ఆఫీసర్లు ఆర్​సుదర్శన్, వర్లపాపయ్య, హైడ్రా ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌వో జయప్రకాశ్, డీఎఫ్‌‌‌‌‌‌‌‌వోలు గౌతమ్, యజ్ఞనారాయణ, హైడ్రా ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ షంషుద్దీన్, ఏడీఎఫ్‌‌‌‌‌‌‌‌వో మోహన్‌‌‌‌‌‌‌‌రావు పాల్గొన్నారు