హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థాలలను కాపాడటంలో హైడ్రా దూకుడు తగ్గటం లేదు. కబ్జాలకు సంబంధించి ఫిర్యాదులు అందిన వెంటనే యాక్షన్ లోకి దిగుతోంది. శనివారం (ఫిబ్రవరి 21) కొండాపూర్ రాజరాజేశ్వరి కాలనీలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. కబ్జాలకు గురైన సుమారు ఏడు వందల కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.
కాలనీకి సంబంధించిన ఇమ్యూనిటీస్ స్థలాలలో అక్రమ కట్టడాలు చేపట్టారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా.. కొండాపూర్ గ్రామం సర్వేనెంబర్ 78/93 లోని సుమారు 7 ఎకరాలు కాలనీకి సంబంధించిన ఇమ్యూనిటీస్ స్థలం కబ్జాయినట్టు గుర్తించింది. దీని విలువ సుమారు 700 కోట్లు ఉంటుందని అంచనా వేశారు అధికారులు.
ALSO READ : కామారెడ్డిలో హైటెన్షన్... కాంగ్రెస్ నేత కారుకు నిప్పు..
భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలను తొలగించారు హైడ్రా అధికారులు. కాలనీకి సంబంధించిన స్థలాన్ని కాపడటంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
