శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టులో ఘటన.. రూ.9.50 కోట్ల హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టులో ఘటన.. రూ.9.50 కోట్ల హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత
  • శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో ఘటన

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్​పోర్టులో రూ.9.50 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్​పోర్టుకు చేరుకున్న థాయ్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు చేపట్టారు. 

ఏడుగురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారి ట్రాలీ బ్యాగుల్లో చూడగా.. 27.15 కేజీల హైడ్రోఫోనిక్​గంజాయి లభ్యమైంది. నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.