కారు ప్రియులకు షాక్.. మే నెల నుంచి హ్యుందాయ్ కార్ల ధరల పెంపు ..ఎంత పెరగనుందంటే?

కారు ప్రియులకు షాక్.. మే నెల నుంచి హ్యుందాయ్ కార్ల ధరల పెంపు ..ఎంత పెరగనుందంటే?

న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా వచ్చే నెల నుంచి తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.  అన్ని మోడళ్లపై ఒక శాతం వరకు ధరల పెంపు ఉంటుంది. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వివిధ మోడళ్లు, వేరియంట్ల ఆధారంగా ఈ పెంపు మారుతూ ఉంటుంది. 

పెరుగుతున్న ఖర్చులను వీలైనంతవరకు కంపెనీయే భరిస్తున్నప్పటికీ, అనివార్య పరిస్థితుల్లో కొంత భారాన్ని వినియోగదారులపై వేయాల్సి వస్తోందని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటికే పలు కార్ల తయారీ సంస్థలు ధరలను పెంచాయి.