నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమంటూ బహిరంగంగానే నోరు విప్పారు. నాతోటి అనురులంతా రఘువీర్ రెడ్డి ని పోటీలో ఉంచుందాం అంటే ఆయననే పోటిలో ఉంచుతాం… లేదు తాము పోటీలో ఉంటాము అని నా అనుచరులు ఎవరైనా చెబితే వారికే నా మద్దతునిస్తానన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యం లో తన నివాసంలో మాజీ మంత్రి జానారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుర్రంపోడ్ మండలానికి చెందిన చెందిన టిఆర్ఎస్ కార్యకర్తలు జానారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని 2012లోనే ప్రణాళికలు పంపించామని.. అయితే ఇప్పుడు ఉప ఎన్నిక నేపథ్యం లో టిఆర్ఎస్ ప్రభుత్వం కాగితపు హామీలు ఇస్తోందన్నారు. హాలియాలో డిగ్రీ కాలేజ్ కంటే ముందు హాలియలో జూనియర్ కాలేజ్ తోపాటు ఐటిఐ కాలేజ్ ఏర్పాటు చేశామని, చలకుర్తిలో నవోదయ స్కూల్ తెచ్చింది కూడా మేమేనని ఆయన గుర్తు చేసుకున్నారు. నాగార్జున సాగర్ లో బిఈడి కాలేజీ మేము తెస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని తరలించిందని ఆరోపించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని జానారెడ్డి పేర్కొన్నారు. నా ప్రధాన అనుచరులు అందరూ అభిప్రాయం తీసుకొని ఒప్పుకుంటేనే నా కొడుకుని పోటీ చేయిస్తా.. నా ప్రధాన అనుచరులు పోటీ చేస్తా అంటే వాళ్లకి అవకాశం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని జానారెడ్డి స్పష్టం చేశారు.
