V6 News

ఖేల్‌ రత్నకు నేను అర్హుడిని కాను: హర్భజన్

ఖేల్‌ రత్నకు నేను అర్హుడిని కాను: హర్భజన్

న్యూఢిల్లీ: ఖేల్‌ రత్న అవార్డుకు తాను అర్హుడిని కానని వెటనర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. భజ్జీ స్వరాష్ట్రమైన పంజాబ్ ఖేల్ ‌రత్న అవార్డుకు టర్బనేటర్ పేరును పరిశీలించింది. అయితే షార్ట్‌లిస్ట్‌లో నుంచి అతడి పేరును తొలగించింది. దీనిపై పలు వార్తలు రావడంతో దూస్రా స్పెషలిస్ట్ స్పందించాడు.

‘డియర్ ఫ్రెండ్స్.. పంజాబ్ ప్రభుత్వం ఖేల్ ‌రత్న కాంపిటీషన్ నుంచి నా పేరును ఎందుకు వెనక్కి తీసుకుందని అనేక ఫోన్‌ కాల్స్ వస్తున్నాయి. నిజం ఏంటంటే.. నేను ఖేల్ రత్నకు అర్హుడిని కాను. ఎందుకంటే గత మూడేళ్లుగా ఇంటర్నేషనల్ పెర్ఫామెన్స్ ఆధారంగానే ఆ అవార్డుకు ఎంపిక చేస్తారు. అది పంజాబ్ సర్కార్ తప్పు కాదు. దీనిపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని మీడియాతోపాటు నా మిత్రులకు కోరుతున్నా. అందరికీ మప్పిదాలు’ అని టర్బనేటర్ ట్వీట్ చేశాడు. గతేడాది ఖేల్‌ రత్న అవార్డులో భజ్జీ నామినేషన్‌ను రిజెక్ట్ చేశారు. డాక్యుమెంట్‌లు ఆలస్యంగా చేరడంతో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్‌ భజ్జీ నామినేషన్‌ను తిరస్కరించింది.