యూపీ ఎన్నికల్లో ఆ పార్టీయే గెలవాలి

యూపీ ఎన్నికల్లో ఆ పార్టీయే గెలవాలి

ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార పార్టీ బీజేపీతో పాటు..ప్రతిపక్ష పార్టీలు ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలు కూడా ప్రచార జోరు పెంచాయి. ఈ క్రమంలో యూపీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ గెలవాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. ప్రజలు ఆదరిస్తే ఈ ఎన్నికల్లో అఖిలేష్ గెలుపొందే అవకాశం ఉందదన్నారు... పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. 

మరోవైపు యూపీలో బీజేపీ అగ్రనేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, మోడీ వరుసగా పర్యటిస్తున్నారు. అఖిలేశ్ యాదవ్ పార్టీ ఎస్పీపై విమర్శల దాడి చేస్తున్నారు. ఈనెల మొత్తం ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి యూపీలో ఎన్నికలు మొదలు కానున్నాయి. మార్చి 10ప ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఎన్నికల ఫలితాల్ని కూడా విడుదల చేయనున్నారు. 

 

ఇవి కూడా చదవండి: 

ఆధార్ తప్పనిసరి కాదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

సీఎం అభ్యర్థిగా చన్నీ ఓకే అన్న సిద్ధూ