సీఎం అభ్యర్థిగా చన్నీ ఓకే అన్న సిద్ధూ

సీఎం అభ్యర్థిగా చన్నీ ఓకే అన్న సిద్ధూ
  • ఉత్సాహంలో కాంగ్రెస్ శ్రేణులు

పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించింది. ఉత్కంఠకు తెరదీస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చరణ్జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో రేసులో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకు నిరాశే మిగిలింది. అయితే అభ్యర్థిని ప్రకటించే సమయంలో స్టేజీపై కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి. రాహుల్ గాంధీ చన్నీ పేరు ప్రకటించిన వెంటనే సిద్ధూ చన్నీ కుడి చెయ్యిని పైకి ఎత్తి అభ్యర్థి ఎంపిక విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నిరూపించాడు. ఆ క్షణంలోనే చన్నీ తన ఎడమ చేతితో సిద్ధూకి పాదాభివందనం చేస్తూ.."సిద్ధూజీ.. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసేయండి. మీ మోడల్‌ అమలు అయ్యి తీరుతుంది" అని  అన్నారు. దీంతో కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధాష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన అభ్యర్థి ఎంపిక సమస్య సమసిపోయినట్లయింది. అక్కడే ఉన్న రాహుల్ గాంధీ ..సిద్ధూ, చన్నీలను ఆలింగనం చేసుకున్నాడు. దీంతో చన్నీ, సిద్ధూలు పంజాబ్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఎనలేని  ఉత్సాహాన్ని నింపడమే కాకుండా ప్రతిపక్షాలకు గట్టి సవాలును విసిరారని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

 

ఇవి కూడా చదవండి..

కేసీఆర్ జిమ్మిక్కులు ప్రజలు నమ్మరు

ఘనంగా కొమురవెల్లి మల్లన్న జాతర