ఆధార్ తప్పనిసరి కాదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

ఆధార్ తప్పనిసరి కాదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యాక్సిన్ తీసుకోనివారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పీహెచ్సీలో వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే.. టీకా వేసుకునేందుకు ఆధార్ కార్డు చూపించాల్సి వస్తోంది. అయితే ఇదే విషయంమై ఇవాళ కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్‌లో ఆధార్ కార్డు వివరాల్సి సమర్పించడం తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. టీకా కోసం ప్రజలను ఆధార్ కోసం అడగాలని పట్టుబట్టవద్దని అధికారులను సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలో కేంద్రం కోర్టుకు పలు విషయాలు చెప్పింది. 

టీకా కోసం కొన్ని కేంద్రాలు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలంటూ పట్టుబడుతున్నాయని దాఖలైన పిల్‌ను న్యాయస్థానం విచారించింది. దీనిపై న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం, కోవిడ్‌ టీకా ఇవ్వడానికి ఏకైక గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డ్‌ని అందించాలని పట్టుబట్టవద్దని అధికారులను కోరింది. దీనిపై కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. CO-WIN పోర్టల్‌లో నమోదు చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదని మరియు తొమ్మిది పత్రాలలో ఏదైనా ఒకదానిని సమర్పించవచ్చని పేర్కొంది. ఆధార్ కార్డు వ్యాక్సినేషన్ తీసుకోవడానికి తప్పనిసరి కాదని తెలిపింది. సంబంధిత అధికారులందరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విధానానకి అనుగుణంగా వ్యవహరిస్తారని బెంచ్ పేర్కొంది.

మంత్రిత్వ శాఖ తరపున వాదిం న్యాయవాది అమన్ శర్మ కోర్టులో తన వాదనలు వినిపించారు. ఆధార్ మాత్రమే ముందస్తు షరతు కాదని, ఎటువంటి గుర్తింపు కార్డు లేని 87 లక్షల మందికి కోవిడ్ టీకాలు వేశారని ఆయన ధర్మాసనానికి తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రాలు ఆధార్ కార్డు అడగకూడదని పిటిషనర్ తరపున వాదించిన న్యాయవాది మయాంక్ క్షీరసాగర్ పేర్కొన్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్/వ్యాక్సినేటర్ కోసం CO-WIN పోర్టల్‌లో ఆధార్ వివరాలను సమర్పించే తప్పనిసరి ముందస్తు షరతును తొలగించడానికి ఆదేశాలను ఇవ్వాలని ఆయన పిల్‌లో కోరారు. దీంతో పాటు CO-WIN పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేయడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు దిశానిర్దేశం చేయాలని కూడా అభ్యర్థించారు. 

ఇవి కూడా చదవండి:

వైరల్ అవుతున్న ‘శ్రీవల్లి’ ఇంగ్లిష్ వెర్షన్

దొర.. మీ జ్వర రాజకీయం అదుర్స్