వైరల్ అవుతున్న ‘శ్రీవల్లి’ ఇంగ్లిష్ వెర్షన్

వైరల్ అవుతున్న ‘శ్రీవల్లి’ ఇంగ్లిష్ వెర్షన్

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఈ ఆల్బమ్ లోని అన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీవల్లి పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ లో బన్నీ వేసిన స్టెప్స్ కు మామూలు జనంతోపాటు సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఫిదా అయ్యారు. ఈ పాటలో బన్నీ వేసిన స్టెప్స్ ను అనుకరిస్తూ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డచ్ గాయని ఎమ్మా హీస్టర్స్ ‘శ్రీవల్లి’ సాంగ్ ను ఇంగ్లిష్ లో తనదైన శైలిలో పాడి విశేషంగా అలరిస్తోంది. ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి’ అంటూ తెలుగులోనూ ఆలపించి ఫిదా చేస్తోంది. ఈ పాటకు ట్యూన్ చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఎమ్మా వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఆమె ప్రతిభను మెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. శ్రీవల్లి ఇంగ్లిష్ వెర్షన్ అదుర్స్ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. 

కాగా, నెదర్సాండ్స్ కు చెందిన సింగర్ ఎమ్మాకు చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. యూట్యూబ్ వేదికగా ఆమె చేసిన పలు కవర్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఎక్కువగా ఇంగ్లిషులోనే పాటలు పాడే ఆమె.. తొలిసారి తెలుగు పాటను ఆలపించడం విశేషం. 

మరిన్ని వార్తల కోసం:

డేరా బాబాకు పెరోల్

జేఎన్‌యూ వీసీగా తెలుగు మహిళ

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు