పులి కదలికలపై నిరంతర పర్యవేక్షణ : డీఎఫ్వో పద్మజారాణి

పులి కదలికలపై నిరంతర పర్యవేక్షణ : డీఎఫ్వో పద్మజారాణి
  • డీఎఫ్​వో పద్మజారాణి

కోహెడ, వెలుగు: పులి కదలికలపై నిరంతరం పర్యవేక్షిస్తూ పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు డీఎఫ్​వో పద్మజారాణి తెలిపారు. గురువారం మండలంలోని సింగరాయ గుట్ట పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న ప్రాంతాలను సీపీ రష్మీ పెరుమాల్​తో కలిసి పర్యటించారు. పులి పాద ముద్రలు కనిపించిన ప్రాంతాలను, సంచరిస్తున్న మార్గాలను పరిశీలించారు. 

కూరెళ్ల, శనిగరం, గుండారెడ్డిపల్లి, తంగళ్లపల్లి  గ్రామాల పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాలకు, ఇతర పనులకు ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలన్నారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. తంగళ్లపల్లి-గుండారెడ్డిపల్లి రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.