జ్యోతిష్యం : సోమవారం మిధున రాశిలో భూమికి దగ్గరగా శక్తివంతమైన అమావాస్య : అర్థవంతమైన మార్పులకు అనుకూలం

జ్యోతిష్యం : సోమవారం మిధున రాశిలో భూమికి దగ్గరగా శక్తివంతమైన అమావాస్య : అర్థవంతమైన మార్పులకు అనుకూలం

2026, జూన్ 15వ తేదీ.. సోమవారం అమావాస్య. రెగ్యులర్ గా ప్రతి 15 రోజులకు ఒక సారి అమావాస్య రావటం కామన్. జూన్ 15వ తేదీ సోమవారం వస్తున్న అమావాస్య చాలా శక్తివంతమైనదిగా చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. ఇది మిధున రాశిలో ఏర్పడుతుంది. అంతే కాదు భూమికి చాలా దగ్గర చంద్రుడు రావటం వల్ల.. మానవాళిపై ఈ అమావాస్య చాలా మార్పులకు దారి తీయొచ్చని అంచనా వేస్తున్నారు జ్యోతిష్య పండితులు. 

2026 జూన్ 15న మరో జ్యోతిష్య సంఘటన రాబోతోంది. మిథున రాశిలో ఏర్పడే సూపర్  మూన్ కావడం వల్ల ఇది మరింత తీవ్రతతో వస్తోంది.  పంచాంగం ప్రకారం జూన్​ 15 అమావాస్య .. అయినా ఆరోజు సూపర్​ మూన్​ కారణంగా పౌర్ణమి రోజు ఉండే తీవ్రత ఉంటుంది.  అధికజ్యేష్ఠమాసంలో ఏర్పడే అమావాస్య  మిథునరాశిలో ఏర్పడుతుంది. ఈ రాశి వలన ఏ రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

మేషరాశి  : ఈ  రాశి వారు తమ లక్ష్యాన్ని సాధించేందుకు  సరైన సమయమని పండితులు అంటున్నారు. వ్యక్తిగతంగా అభివృద్ది ఉంటుంది. ఈ రాశివారి  శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడటంతో  ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. 

వృషభరాశి :ఈ రాశి వారికి చంద్రుడు లాభ స్థానంలో ఉండటం వలన ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరగడం.. సమాజంలో గౌరవం  పెరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఆదాయం పెరగడం ముఖ్య మైన అవసరాలు, సమస్యలు తీరిపోతాయి. 

మిథునరాశి :ఇదే రాశిలో అమావాస్య ఏర్పడుతుంది .  ఆ సమయంలో చంద్రుడు భాగ్యస్థానంలో ఉండటం వలన మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలు చేయండి.  ఏ విషయం గురించి కూడా అతిగా ఆలోచించవద్దు.  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్న సమయానికే పనులు పూర్తవుతాయి. కెరీర్​ విషయంలో మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.. కొత్త అవకాశాలు లభిస్తాయి.

కర్కాటకరాశి : జూన్​ 15 .. అమావాస్య రోజు ఈ రాశి వారి భావోద్వేగాలను వ్యక్తపరిచేందుకు అనుకూలంగా ఉంటుంది.ముఖ్యంగా ప్రేమికులకు బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. పెండింగ్​ లో ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి.  ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆఫీసులో పనికి తగిన గుర్తింపు పొందుతారు. సీనియర్ల మద్దతు లభిస్తుంది.

సింహరాశి :  ఈ రాశిపై సూర్యుడు రాశి మార్పు చాలా అధికంగా ఉంటుంది.  మిథన రాశిలో సంచరించడం వలన అన్ని పనుల్లో విజయం కలుగుతుంది.  కొత్తగా ఇల్లు కట్టేందుకు అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఏ పని చేసినా అందులో విజయం అందుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది.

కన్యారాశి:  మిథున రాశిలో అమావాస్య ఏర్పడటంవలన  ఈ రాశి వారికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. .  సమాజంలో హోదా.. గౌరవం.. కీర్తి .. ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది.ఉద్యోగస్తులకు ప్రమోషన్​తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది.    ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.  

తుల రాశి: సూర్యుడు  .. మిథునరాశిలో సంచరించడం వలన ఈ రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.  పెండింగ్ పనులు పూర్తవుతాయి.  ఆస్తికి సంబంధించిన లావాదేవీలు పరిష్కారమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి.  ఉద్యోగస్థులకు ప్రమోషన్​ లభిస్తుంది. 

వృశ్చికరాశి:  మిథున రాశిలో అమావాస్య  వలన ఈ రాశి వారికి పరిస్థితులు వ్యతిరేకంగా మారే ఛాన్స్​ ఉన్నందున చాలా అప్రమత్తంగా ఉండాలి.   ప్రతి విషయంలో కూడా ఒకటి అనుకుంటే మరొకటి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు.. ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.   డబ్బు  లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్స్​ జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

ధనస్సురాశి:   మిథున రాశిలో అమావాస్య వలన ఈ రాశి వారికి  అన్నీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.  కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు.  వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి అవార్డులు అందుకుంటారు. .  వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే ఆశించిన లాభాలు కలుగుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది .  ఆరోగ్యం మెరుగు పడుతుంది. . కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని పండితులు చెబుతున్నారు

 మకరరాశి: జూన్ 15 వ తేదీన మిథున రాశిలో అమావాస్య వలన ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.  కెరీర్​ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కాని కష్టపడాల్సి ఉంటుంది.  ప్రతి పని కూడా సవాళ్లతో పూర్తి చేస్తారు. మీరు చేపట్టిన పనులు మొదట్లో ఆందోళన కలిగినా.. చివరకు పూర్తి చేస్తారు.  ఆఫీసులో మీరే కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  వ్యాపారస్తులు కష్టపడాల్సి ఉంటుంది.  

కుంభరాశి:  ఈ రాశివారు చాలా బిజీబిజీగా గడుపుతారు.  కష్టాన్ని నమ్ముకుంటే ముందుకెళతారు.   కొత్తగా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  తోటి ఉద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు.  ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి. 

మీన రాశి:   ఈ రాశి వారికి రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పొదుపు చేసే అవకాశం ఉంటుంది. వృత్తి, సామాజిక స్థాయిలో పురోగతిని ఇస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరగవచ్చు. కానీ వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం