భక్తులకు శుభవార్త.. ప్రారంభోత్సవానికి సిద్దంగా కొమురవెళ్లి రైల్వే స్టేషన్

భక్తులకు శుభవార్త.. ప్రారంభోత్సవానికి సిద్దంగా కొమురవెళ్లి రైల్వే స్టేషన్

కొమురవెల్లి  మల్లన్న  భక్తులకు శుభవార్త.. కొమురవెల్లి మల్లన్న పుణ్య క్షేత్రానికి ఇకపై రైళ్లలో వెళ్లవచ్చు. కొత్త నిర్మిస్తున్న కొమురవెళ్లి రైల్వే స్టేషన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రారంభించేందుకు సిద్దంగా ఉంది. రేపేమాపో ప్రారంభించనున్నారు. ఈ రైల్వే స్టేషన్ ప్రారంభమైతే హైదరాబాద్ నుంచి, ఇతర ప్రాంతాలనుంచి భక్తుల ప్రయాణానికి మరింత సౌకర్యంగా ఉంటుంది. దీంతోపాటు కొమురవెళ్లి  పుణ్యక్షేత్రాన్ని ఇతర ప్రాంతాలతో కనెక్టివిటీ మెరుగుపడనుంది. 
 
సిద్దిపేట జిల్లాలో కొత్తగా నిర్మించిన కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం (జూన్ 13) ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రసిద్ధ కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు కనెక్టివిటీని పెంచేందుకు ఈ రైల్వే స్టేషన్‌ను నిర్మించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5.63 కోట్లు కాగా, ఇప్పటికే 99 శాతం పనులు పూర్తయ్యాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

►ALSO READ | Vastu tips: వాటర్ సంప్ ఎక్కడ ఉండాలి.. ప్రహరీ నిర్మాణంలో వాస్తు పాటించాలా..!

త్వరలోనే స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌కు సుమారు 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి వస్తే భక్తుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.