విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాలి: సిద్దిపేట కలెక్టర్

విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాలి: సిద్దిపేట కలెక్టర్

గజ్వేల్(వర్గల్​), వెలుగు: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆగస్టు 15 నాటికి కచ్చితంగా ఒక జత యూనిఫామ్ అందించేలా తయారీదారులు వేగంగా పనిచేయాలని సిద్దిపేట కలెక్టర్ కే. హైమవతి ఆదేశించారు. శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ కోసం చేపట్టిన క్లాత్ కటింగ్ ప్రక్రియను ఆమె పరిశీలించి మాట్లాడారు.

వర్గల్ మండలంలోని 3,830 మంది విద్యార్థుల కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన వస్త్రాన్ని వృథా కాకుండా కొలతల ప్రకారం కటింగ్ చేయాలని, ఆపై వెంటనే ఆ క్లాత్‌ను గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్​హెచ్‌జీ) మహిళలకు అందజేసి కుట్టుపనిని వేగవంతం చేయాలని సూచించారు.