జ్యోతిష్యం : కర్కాటకరాశిలో గజకేసరి యోగం... నాలుగు రాశుల వారికి ధనవర్షం

జ్యోతిష్యం :  కర్కాటకరాశిలో గజకేసరి యోగం... నాలుగు రాశుల వారికి ధనవర్షం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులు, వాటి కలయికకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల అనుకూల స్థితి వల్ల కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. సుదీర్ఘ కాలం తర్వాత కర్కాటక రాశిలో  2026 జూన్​ 17 వ తేది ఉదయం 08:12 గంటలకు అక్కడే ఉన్న గురుడితో చంద్రుడు కలిసి గజకేసరి యోగాన్ని ఏర్పరచనున్నాడు.  దీని ప్రభావం వలన నాలుగు రాశుల వారి ఇళ్లలో ధన వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. .  .! 

కర్కాటక రాశి :  గజకేసరి యోగం వలన ఈ రాశి వారికి ఆకర్షణ శక్తి పెరుగుతుంది.  . సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనేక లాభాలను చూస్తారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. . దేశాల్లో స్థిరపడాలనుకునే వారు గుడ్​ న్యూస్​ వింటారు.  ఆకస్మిక ధన లాభం కలిగే  సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్థి కలసి వస్తుంది.  ముఖ్యంగా బంధు వర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రేమ జీవితం కూడా బాగుంటుంది.

తులా రాశి:  ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఉద్యోగస్తులు కీలక పాత్రపోషించే అవకాశం ఉంది.  చేపట్టిన పనుల్లో 90 శాతం లాభం ఉంటుంది. వృత్తి పరంగా ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి ఆశించిన ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా సుఖ సంతోషాలు నెలకొంటాయి.

కన్యా రాశి: గజకేసరి యోగం వలన ఈ రాశి వారు సమాజంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు.  చాలా కాలంగా పెండింగ్​ లో ఉన్న కోరికలు నెరవేరుతాయి.  వీరు చేపట్టిన పనుల్లో 92 శాతంలో అభివృద్ది ఉంటుంది. ఆగిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికార యోగం కలిగే అవకాశం ఉంది. జాబ్​ మారాలనుకునే వారికి ఈ సమయం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా అంది వస్తాయి.అనుకూలతలు బాగా పెరుగుతాయి.  వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఆర్థికంగా.. ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.

మీన రాశి : గజకేసరి యోగం వలన ఈ రాశి వారికి జీవితంలో అనుకోని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపయ్యే సూచనలున్నాయి.  స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.  కొత్తగా ప్రాజెక్ట్​లు చేపడతారు.సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.